ఎన్కూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. వైరాలో జరిగే ముఖ్యమంత్రి సభకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకోకుండా పోలీసులు ఆరెస్ట్ చేయడం, స్వాతంత్య్ర దినోత్సవం నాడు మహిళలను కించ పరచడమే అవుతుందని నేత ఏర్పుల రాములు అన్నారు. మహిళా పోలీసులు లేకుండా స్త్రీలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అమల, అనురాధ, బాలాజీ, నాగేశ్వరరావు, రజిని తదితరులు ఉన్నారు.