కారేపల్లి క్రాస్ రోడ్డులో ఆంజనేయస్వామి భజన కార్యక్రమం

71చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయస్వామి భజన కార్యక్రమం నిర్వహించారు. భక్త మండలి సంబంధించిన తాత అచ్చారావు ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలతో కూడిన భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్