బాజుమల్లయిగూడెంలో ఘనంగా ఉపాధి హామీ ఆవిర్భావ వేడుకలు

56చూసినవారు
బాజుమల్లయిగూడెంలో ఘనంగా ఉపాధి హామీ ఆవిర్భావ వేడుకలు
కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లయిగూడెంలో ఉపాధి హామీ 19వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి కరుణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వందరోజుల పని దినం దిమ్మె వద్ద వేడుకలు నిర్వహించి పని విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ సుజాత రావు, సతీషు, సీతమ్మ, వెంకటస్వామి, మల్లయ్య, దేశు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్