రోడ్డు ఇరువైపుల ఆక్రమణతో ఇబ్బందులు

67చూసినవారు
రోడ్డు ఇరువైపుల ఆక్రమణతో ఇబ్బందులు
కారేపల్లి గ్రామపంచాయతీలో సినిమా సెంటర్ నుండి సంతకు చేరుకునే ప్రధాన రహదారికి ఇరువైపుల వర్షపు నీరు నిల్వ ఉండి సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉందంటూ గ్రామస్తులు తెలిపారు. సీసీ రోడ్డు పూర్తిగా మూసి వేయడంతో వర్షపు నీరు రహదారి గుండా ప్రవహిస్తూ, నిల్వ ఉంటూ ద్విచక్ర వాహనదారులకు, పాదరక్షకులకు ఇబ్బందిగా మారింది. మండల అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్