సింగరేణి: యువతకు క్రీడా సామాగ్రి అందజేత

74చూసినవారు
సింగరేణి: యువతకు క్రీడా సామాగ్రి అందజేత
సింగరేణి మండల కేంద్రంలో భరత్ నగర్ కాలనీకి చెందిన యువతకు జిల్లా మైనార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు ఎస్కే గౌసుద్దీన్ శనివారం యువతకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలని, క్రీడలు శారీరక, మానసిక, ఆరోగ్య ఉల్లాసానికి ఉపయోగపడుతుందని అన్నారు. యువతకు క్రీడా సామాగ్రి అందజేసిన గౌసుద్దీన్ కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్