వైరా: కొత్తలింగాల ఆలయ హుండీ ఆదాయం రూ. 35వేలు
కామేపల్లి మండలంలోని కొత్తలింగాలలో శ్రీకోట మైసమ్మతల్లి ఆలయం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు మంగళవారం లెక్కించారు. ఈఓ నల్లమోతు శేషయ్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యాన హుండీ లెక్కించగా రూ. 35వేల ఆదాయం నమోదైంది. తొలుత ఆలయ ప్రాంగణంలోని షాపులకు వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనకపోవడంతో వాయిదా వేశారు.