నిరంతరం ఉద్యమాలు చేసినప్పుడే గుర్తింపు: సీపీఎం

69చూసినవారు
కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామంలో సీపీఎం పార్టీ గ్రామశాఖ మహాసభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీ నిర్ణయించిన సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసినప్పుడే గుర్తింపు ఉంటుందని చెప్పారు. అనంతరం పార్టీ నూతన గ్రామ శాఖ కార్యదర్శిగా సీతారాములను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్