TG: నీలోఫర్ దవాఖానలో శనివారం జరిగిన నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 6 గంటల వ్యవధిలోనే నాంపల్లి పోలీసులు చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. పరిగి వద్ద కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఈ కేసులో కిడ్నాప్ చేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.