గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ 2024లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 'హనుమాన్' మూవీ స్క్రీనింగ్ అయ్యాక హీరో తేజా సజ్జ స్టేజీపైకి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ సీనియర్ సిటిజన్ అతని కాళ్లకు నమస్కరించాడు. వెంటనే తేజా వద్దు అంటూ దూరం జరిగారు. అనంతరం ఈ మూవీ విషయమై మాతృభాష తెలుగులో మాట్లాడుతానని తేజ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో అభినందించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.