తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా సొంత నానమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన పెద్ద రాజభవనాన్ని బుల్డోజర్లతో కూలగొట్టాడు. ఉపగ్రహ చిత్రాల్లో ఆ భవనం ఆనవాళ్లు కూడా లభించని విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించారు.