ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల రేవంత్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లాడు కదా..? ఎన్ని కోట్ల పెట్టబడులు తెలంగాణకు తెచ్చాడు.. అవి ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తనతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అమెరికాకు వస్తే.. ఆరు నెలల్లో రెండు రాష్ట్రాలకు లక్ష కోట్లు, వంద కంపెనీలు వచ్చేలా చేస్తా అన్నారు.