కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా నెల రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యపరిచారు. శనివారం ఉదయం వారు నిరసన చేస్తున్న వేదిక వద్దకు ఆమె వెళ్లారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను కోరారు. కాగా, జూనియర్ డాక్టర్లు భారీ వర్షంలో రోడ్డుపై నిరసనలు చేస్తుంటంతో తాను కూడా నిద్రలేని రాత్రులు గడిపానని సీఎం తెలిపారు.