గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు

58చూసినవారు
గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు
గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న నిషేధిత గంజాయి మొక్కలను జైనూర్ ఎస్సై సాగర్ పోలీస్ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండలం గౌరీ కోలం గూడా గ్రామానికి చెందిన సీడాం రాము తన వ్యవసాయ పంట పొలంలో పత్తి పంటతో పాటు 30 గంజాయి మొక్కలను సాగుచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 30 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్