చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ కొవిడ్ అంత తీవ్రమైన వైరస్ కాదని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్ధార్థ తెలిపారు. ఫ్లూ, జలుబు, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైరస్ పట్ల ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పని లేదన్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లేప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు.