బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం ఆదివాసీ ముద్దు బిడ్డ కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆదివాసీ నాయకులు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవని అవన్నీ భూమి కోసం భుక్తి కోసం స్వయం పాలన కోసం జరిగినవని, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ఆదివాసి ప్రజలు నిజం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురైనారు.