వాంకిడి మండల కేంద్రంలోని రాంనగర్ కు చెందిన వృద్ధురాలు గత కొన్ని నెలలు క్రితం కాలు విరిగి మంచానికే పరిమితం మై బాధపడుతున్న తరుణంలో మండల అధ్యక్షులు నారాయణ, టౌన్ అధ్యక్షులు అనిల్ బుధవారం పరామర్శించారు. ఆమెకు పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మందో కార్ అనిల్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం జీవన్, పాండు, తదితరులు ఉన్నారు.