మహారాష్ట్ర ఎన్నికలలో ఓట్లు వేస్తున్న కేరామెరి మండల ఓటర్లు

73చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని రెండు రాష్ట్రాల వివాదాస్పద గ్రామాలైన పరందొలి. ముకదంగూడ, అంతాపూర్, బోలాపటార్ పంచాయతీల ప్రజలు మహారాష్ట్ర ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. రాజురా అసెంబ్లీ స్థానానికి బుధవారం నిర్వహిస్తున్న ఎన్నికల్లో బరిలో ఉన్న మహారాష్ట్ర అభ్యర్థులకు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్