కాగజ్నగర్: డాక్టర్ నిర్లక్ష్యం.. రెండు నెలల బాబు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రెండు నెలల బాలుడు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు బాలున్ని ఆసుపత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం బాబు ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.