కాగజ్ నగర్ మండల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
కాగజ్ నగర్ మండల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం 11: 00 గంటలకు పుల్ల అశోక్ అధ్యక్షతన బట్పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొంగ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని బూతు స్థాయి లీడర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు.