కాగజ్నగర్: పారిశుద్ధ్యంపై షాపు యజమానులకు అవగాహన
కాగజ్నగర్ మునిసిపల్ కమీషనర్ ఎస్. అంజయ్య ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్క్ కాలనీలోని కమర్షియల్ షాప్స్ ఓనర్స్ తో పారిశుద్ధ్యం మరియు దాని నిర్ములన, రోజు విలువడే పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్యం వాహనముకు అందచేయాలని, చెత్త వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ - డి. ప్రణీల్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ - ఎం. శంకర్, షాప్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.