ఇండ్లలోకి వరద నీరు?

52చూసినవారు
కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్ లోతట్టు ప్రాంతాలు కావడంతో ఇండ్లలోకి వరద నీరు చేరినది. కారు, బైకులు, నిత్యావసర సరుకులు, స్కూటీలు, నీటిలో మునిగిపోవడం జరిగిందని ద్వారకా నగర్ కాలనీ వాసులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పై అధికారులు స్పందించి వెంటనే ఇండ్లకు వరద నీరు చేరిన వారికి తగిన సహాయం చేయాలని, ఎమ్మెల్యే కాలనీలోకి వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్