ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. అధికారులు దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని రహదారి చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు. రహదారి ఈ విధంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.