May 15, 2024, 06:05 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్
చెస్ ఉచిత శిక్షణా శిబిరం
May 15, 2024, 06:05 IST
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఉచిత చెస్ కోచింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోష్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ. కోచింగ్ క్యాంపు నెల రోజులపాటు జరుగుతుందని, పిల్లలు కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, బోగె ఉపేందర్, కల్పన తదితరులున్నారు.