కాగజ్‌నగర్ ఓల్డ్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం పదోతరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రతీరోజు ఉదయం అల్పాహారం అందజేస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ. చదువులపై శ్రద్ద పెట్టాలని వారు ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్ధులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ హుసేన్, రమణ, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.