డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేశ్

71చూసినవారు
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేశ్
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం అనంతపురం శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు విచ్చేయనున్నారు. ఈవెంట్ జరిగే ప్రదేశాన్ని బుధవారం జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్