కాగజ్ నగర్: ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

53చూసినవారు
కాగజ్ నగర్: ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన
కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో కొత్తపల్లి వెంకట లక్ష్మీ-చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకుడు కొత్తపల్లి శ్రీనివాస్ అనిత ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 38 మంది హాజరు కాగా వారిలో 15 మందికి శస్త్రచికిత్స అవసరమని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ చేపిస్తామని తెలిపారు. ప్రతీ మంగళవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్