కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వార్ల తిరుపతి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కస్తూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.