పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్వాల్ వాడలో శనివారం అంకుబాయి ఇల్లు భారీ వర్షానికి కూలి పోయిన సమాచారం తెలుసుకున్న ఎస్సై కొమురయ్య ప్రమాదం జరిగిన స్థలంలో ఇంటిని పరిశీలించి, బాధితురాలుని వివరాలు అడిగి సోమవారం రూ. 2000 నగదు, 40 కిలోల బియ్యం, చెద్దర్లలను బాధితురాలికి అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రమాదంగా ఉన్న ఇండ్లలో ఉండొద్దని అన్నారు.