కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల గ్రామపంచాయతీని విభజించొద్దని కోరుతూ గురువారం పలువురు నాయకులు గ్రామస్థులతో కలిసి స్తానిక కొమురం భీం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామపంచాయతీని రెండుగా చిల్చకూడదని ఉమ్మడి గ్రామపంచాయతీగా కొనసాగించాలని డిమాండ్‌ను చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.