రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలి

62చూసినవారు
కాగజ్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్నారు. సోమవారం కాగజ్‌నగర్‌ లోని వారి నివాసంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాన్ని ఆయన శాలువాలతో సన్మానించారు. రైతులకు అందుబాటులో ఉండి, రైతులు ఆర్థికంగా బలపడేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :