
కాగజ్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం
కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్లు ఎన్. రామస్వామి, వి. కిషన్ హాజరై విద్యార్థులకు సైన్స్ సంబంధిత అంశాలపై అనేక విషయాలను వివరించారు. ప్రొఫెసర్లు మాట్లాడుతూ భారతదేశంలో అనేక పరిశోధనలు జరగాల్సి ఉందని వివరించారు.