రోడ్డుపై కంకర వేసి కాటేస్తున్నారు
వాంకిడి మండలం ఖమనా గ్రామం రహదారి పనితీరుకు అద్దం పడుతోందని ఆదివారం బాధితులు మీడియాతో గోడును వెళ్లబోసుకున్నారు. గుంతలమయంగా మారిన ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు కాంట్రాక్టర్ తారు తొలగించి కంకర పరిచారు. తారు వేయకుండా వదిలేశారు. రాకపోకలు సాగించే పాదచారులకు కంకర గుచ్చుకుంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయలని ద్విచక్ర వాహనదారులు ప్రజలు పలువురు కోరుతున్నారు.