అశ్వారావుపేట: రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

50చూసినవారు
అశ్వారావుపేటలో మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీసులు హెల్మెట్ ధరించని వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని, ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని మరవకూడదని ఎస్ఐ యయాతి రాజ్ అన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్