ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని విద్యార్థుల పక్కన కూర్చొని పరిశీలించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలని, అర్ధవంతంగా బోధించి ఉత్తమ ఫలితాలు వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు.