దళిత విలేకరి తమ్మల్ల రాజేష్ పై జరిగిన భౌతిక దాడికి ఖండన

73చూసినవారు
దళిత విలేకరి తమ్మల్ల రాజేష్ పై జరిగిన భౌతిక దాడికి ఖండన
భద్రాచలంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దళిత విలేఖరి తమ్మల రాజేష్ పైన జరిగిన దాడి అమానుషమని ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి అలవాలరాజా పెరియర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగితే ప్రభుత్వం, చట్టాలు, పోలీసు యంత్రాంగానికి తెలియపరచాలి కానీ ఇష్టానుసారంగా భౌతిక దాడి చేయడం, గాయపరచడం , అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. రాజేష్ పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్