తెలంగాణ రాష్ట్రంలో వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. పచ్చని చెట్లు ఎత్తయిన రెండు కొండల మధ్య మంచి రాళ్ల మీదుగా ఎగిసి పడుతున్న జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం బొగత సందర్శనకు అధిక సంఖ్యలో ఆదివారం తరలివచ్చారు.