చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులో సోమవారం వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురిసిన వర్షాలకు జలాశయానికి వరద
నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులో 22 గేట్లను..రెండు అడుగుల ఎత్తున ఉంచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 29 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఏఈ ఉపేందర్ లోతట్టు గ్రామాల ప్రజలను సోమవారం అప్రమత్తం చేశారు.