నేడు భద్రాచలం ఐటిడిఏ కాంట్రాక్టు ఉపాధ్యాయుల మహాధర్నా

814చూసినవారు
నేడు భద్రాచలం ఐటిడిఏ కాంట్రాక్టు ఉపాధ్యాయుల మహాధర్నా
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా పని చేసిన కాంట్రాక్టు ఉపాధ్యాయులను 2019-20 విద్యా సంవత్సరానికి గాను 54 రెన్యువల్ చేయకుండా ఐటీడీఏ భద్రాచలం పివో అకారణంగా తొలగించడం జరిగింది. సిఆర్టీ లను విధుల్లోకి తీసుకోవాలని ఇది వరకే రిలే నిరాహార దీక్ష, ఐటీడీఏ భద్రాచలం నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు మహా పాదయాత్రను చేయడం జరిగింది. అదే విధంగా ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో 54 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని గిరిజన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ ఐటీడీఏ భద్రాచలం పిఓ, సిఆర్టిలను రెన్యువల్ చేయకుండా 54 కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోతున్నారు. కావున కాంట్రాక్టు ఉపాధ్యాయులను తక్షణమే రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని నిరసిస్తూ ఆదివారం భద్రాచలం సారపాక నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ధర్నా కార్యక్రమంలో చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 250 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్