భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఎ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న 199 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాలు అందక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. గత 5 నెలల నుంచి ఐటీడీఏ అధికారులు వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబ పరిస్థితులు దయనీయంగా మారాయి. అనేకసార్లు ఐటీడీఏ పీవో, కమిషనర్ ను విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. దీంతో దసరా పండుగను కూడా జరుపుకోలేని అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామని కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.