Dec 14, 2024, 16:12 IST/
పేదోడి పిల్లలు.. ధనవంతుల పిల్లల్లా చదవాలి: పొంగులేటి
Dec 14, 2024, 16:12 IST
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. 'పేదోడి పిల్లలు, ధనవంతుల పిల్లల్లా చదవాలి. 40% డైట్ చార్జీలు, 250% కాస్మోటిక్ చార్జీలను ఇందిరమ్మ ప్రభుత్వం పెంచింది. 5 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం చేస్తున్నాం' అని అన్నారు.