TG: నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి సరదాగా భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. చిన్నారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.