సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బోటు మీద మినీ వ్యాన్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లారు. బోటు ఒడ్డుకు పూర్తి చేరువలోకి రాకపోవడంతో ఇరువైపుల రెండు చెక్కలు వేసి వాటి మీదుగా ప్రమాదకరంగా వ్యాన్ నడిపించారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది ఎందుకు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.