బూర్గంపాడు మండలం తాళ్ల గోమ్మూరు పంచాయతీకి చెందిన పుష్పల భాస్కర్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. గురువారం జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమంలో బూర్గంపాడు మండల నాయకులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు.