సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే తీరును జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ బుధవారం పరిశీలించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో జరుగుతున్న సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ సర్వేకు అన్ని వివరాలు తెలియజేస్తూ సహకరించాలని అన్నారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.