ఆత్మహత్యాయత్నం చేసుకుని మరణించిన కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని సేవాలాల్ సేన ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన జాతీయ నాయకుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ. కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.