కొత్తగూడెం: సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత మహర్యాలీ

59చూసినవారు
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో శాంతియుత మహర్యాలీ చేపట్టారు. గురువారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం రైల్వేస్టేషన్ లో మంత్రుల ఫోటోలు ధరించి మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. తమకు గతంలో రేవంత్ రెడ్డి హమీ ఇచ్చిన మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్