భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిరుపయోగంగా ఉండటాన్ని ములకలపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ తీవ్రంగా ఖండించారు. గత సంవత్సరకాలంగా నిరుపయోగంగా ఉండటంతో ములకలపల్లిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రధాన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి క్యులో ఉండవలసి వస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా అధికారులు స్పందించి త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.