జీవో నెం.3పై జెడ్పీచైర్మన్ ను కలిసిన టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

1703చూసినవారు
జీవో నెం.3పై జెడ్పీచైర్మన్ ను కలిసిన టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందును వారి స్వగ్రామం బాల్యతండా నందు బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3 ప్రాముఖ్యతపై వారికి వివరించారు. ఇటీవల సుప్రీంకోర్టు జీవో నెం.3పై ఇచ్చినటువంటి తీర్పు ఏజెన్సీ ప్రాంత వాసులకు వ్యతిరేకంగా ఉన్నట్లు వారు తెలిపారు.

దీనిపై భవిష్యత్తులో తిరిగి 100% రిజర్వేషన్ అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై కార్యాచరణ రూపొందించేందుకు చర్చించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని ట్రైబల్ మినిస్టర్ తో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పిజి హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ నాయక్, టీఎస్ టిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బానోత్ రంగ్గన్న, మండల ప్రధాన కార్యదర్శి రామారావు, సేవాలాల్ సేనా జిల్లా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్