భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావుకాలనీలో ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు రాత్రి 9 గంటలకు స్థానిక యువకులు ఐక్యత దీపాన్ని కాగడాలతో 9 నిమిషాల పాటు వెలిగించారు. ఈ సందర్భంగా వారు దేశ్ కో బచావో, కరోనా హటావో, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను రక్షించాలని, దేశం నుంచి కరోనా వైరస్ ను పారదోలాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు కాలనీ యూత్ సభ్యులు, హోలీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.