ఇల్లందు: నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని నిరసన

59చూసినవారు
ఇల్లందు: నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని నిరసన
హైకోర్టు తీర్పు అమలు చేసి ఇల్లందు కోయగూడెం ఓసీ 2 భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కోయగూడెం ఓసీలో భారీ ర్యాలీ నిర్వహించి, కేఓసీ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్